బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను మిచాంగ్ కారణంగా గత మూడు రోజుల నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు అవుతుంది. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఇలా తుఫాను విరుచుకుపడడంతో జిల్లా వ్యాప్తంగా రైతాంగం కుదేలయ్యింది.
జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాతం వరి పంటలు కోతలు పూర్తి అవడం ఇంకా పొలాల్లోనే వరి చేను ఉన్న సమయంలో తుఫాను కారణంగా భారీ వర్షాలు పడడంతో చేతికొచ్చిన పంట నీటి పాలు అయిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగా లెక్కలు లేనప్పటికీ వేల ఎకరాల్లో వరి పంట తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు. తుఫాను నేపథ్యంలో అధికారులు ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా పంట నష్ట తీవ్రతను అడ్డుకోలేకపోయారు. ఇదే అదునుగా ధాన్యం కొనుగోలు దళారులు కల్లాల్లో తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో అనేక కొర్రీలు పెడుతూ అధికారులు గాని దళారులు గాని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా రైతులను ఇంకొంత మనోవేదనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకొని తడిచిన ధాన్యం కొనే విధంగా ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్షాలు ఇలానే ఇంకొక రెండు రోజులు కొనసాగితే ధాన్యం మొలకలు వచ్చే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
జిల్లావ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు..
77
previous post