చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద, సోమవారం రాత్రి పది గంటల 45 నిమిషాల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులపై రాళ్లు విసరడంతో ముందు ఉన్న అద్దాలు పగిలిపోయాయి, బిత్తర పోయిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయభ్రాంతులకు లోనయ్యారు, ఎవరైనా దోపిడీ ముఠా ఈ విధంగా చేశారేమోనని తమను ఏమైనా చేస్తారేమోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు, డ్రైవర్ బస్సు దిగి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఇది మందుబాబుల పని లేదా ఆకతాయిల పని అయి ఉంటుందని పోలీసులకు సమాచారం అందించారు, గడచిన రెండు నెలల కాలంలో ప్రైవేటు బస్సులకు సంబంధించిన ఆరు బస్సుల మీద ఇదేవిధంగా రాళ్ల దాడి జరిగింది, వేలాది రూపాయల ముందు అద్దాలు కిటికీలు ధ్వంసం చేశారని వాపోయారు డ్రైవర్లు, గంటాఊరు ఫ్లైఓవర్ పక్కన రెండు డాబా హోటల్స్ ఉన్నాయి,పూటుగా మద్యం తాగి ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని ఆకతాయితనంగా కొంతమంది వ్యక్తులు బస్సులపై రాళ్లు విసరడంతోనే ఈ విధమైన ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు, వరుస ఘటనలతో ప్రయాణికులకు ప్రాణ సంఘటనగా మారింది, దీనిపై గతంలో పోలీసులు నిఘా పెడుతున్నామని తెలిపినా, ఇంతవరకు ఖచ్చితమైన ఏర్పాట్లు అయితే లేవని స్థానికులు భావిస్తున్నారు, దీంతో ప్రైవేటు బస్సులు గంటాఊరు ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ఎక్కడ తమ బస్సులపై ఎటువైపు నుండి రాళ్ళదాడికి దిగుతారోనని భయాందోళన వ్యక్తం చేస్తూ బస్సులు నడుపుతున్నారు, కాగా రాత్రి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కచ్చితంగా నిందితులను పట్టుకొని శిక్షిస్తామని వారికి భరోసా కల్పించారు, ఏది ఏమైనా పలమనేరు గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద ప్రయాణించాలంటే వాహన చోదకులు భయాందోళనలతో గజగజ వణికిపోతున్నారు.
గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద ప్రైవేట్ బస్సుపై రాళ్ల దాడి
59
previous post