తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, బాలుడి కిడ్నాప్ ఆపై దారుణ హత్య, ఈ వార్త విని ఉలిక్కిపడ్డ వరదయ్యపాలెం,బుచ్చినాయుడు కండ్రిగ మండలాల ప్రజలు, తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పాదిరివేడు గ్రామానికి చెందిన హాహిష్(8) బాలుడిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన రేఖా అనే మహిళ. బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో బాలుడిని హత్య చేసి చెట్ల పొదల్లో మూటగట్టి పడవేసిన పరారైన మహిళ రేఖ. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తమిళనాడుకు తరలించిన తమిళనాడు పోలీసులు. వరదయ్యపాలెం మండలంలోని కాంభాకం లోని ఓ వ్యక్తి సహాయంతో ఈ దారుణానికి పాల్పడిన రేఖ. వరదయ్యపాలెం మరియు బుచ్చినాయుడు కండ్రిగ మండలాల పోలీసుల సాయం తీసుకొని కేసును చేదించిన తమిళనాడు పోలీసులు.
cvr news channel cvr news channel telugu
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద, సోమవారం రాత్రి పది గంటల 45 నిమిషాల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులపై రాళ్లు విసరడంతో ముందు ఉన్న అద్దాలు పగిలిపోయాయి, బిత్తర పోయిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయభ్రాంతులకు లోనయ్యారు, ఎవరైనా దోపిడీ ముఠా ఈ విధంగా చేశారేమోనని తమను ఏమైనా చేస్తారేమోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు, డ్రైవర్ బస్సు దిగి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఇది మందుబాబుల పని లేదా ఆకతాయిల పని అయి ఉంటుందని పోలీసులకు సమాచారం అందించారు, గడచిన రెండు నెలల కాలంలో ప్రైవేటు బస్సులకు సంబంధించిన ఆరు బస్సుల మీద ఇదేవిధంగా రాళ్ల దాడి జరిగింది, వేలాది రూపాయల ముందు అద్దాలు కిటికీలు ధ్వంసం చేశారని వాపోయారు డ్రైవర్లు, గంటాఊరు ఫ్లైఓవర్ పక్కన రెండు డాబా హోటల్స్ ఉన్నాయి,పూటుగా మద్యం తాగి ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని ఆకతాయితనంగా కొంతమంది వ్యక్తులు బస్సులపై రాళ్లు విసరడంతోనే ఈ విధమైన ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు, వరుస ఘటనలతో ప్రయాణికులకు ప్రాణ సంఘటనగా మారింది, దీనిపై గతంలో పోలీసులు నిఘా పెడుతున్నామని తెలిపినా, ఇంతవరకు ఖచ్చితమైన ఏర్పాట్లు అయితే లేవని స్థానికులు భావిస్తున్నారు, దీంతో ప్రైవేటు బస్సులు గంటాఊరు ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ఎక్కడ తమ బస్సులపై ఎటువైపు నుండి రాళ్ళదాడికి దిగుతారోనని భయాందోళన వ్యక్తం చేస్తూ బస్సులు నడుపుతున్నారు, కాగా రాత్రి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కచ్చితంగా నిందితులను పట్టుకొని శిక్షిస్తామని వారికి భరోసా కల్పించారు, ఏది ఏమైనా పలమనేరు గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద ప్రయాణించాలంటే వాహన చోదకులు భయాందోళనలతో గజగజ వణికిపోతున్నారు.
నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ పై కార్యాచరణ ప్రారంబించాలి. ప్రతీ మంగళవారం ,శుక్రవారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్న 01 వరకు ప్రజా వాణి నిర్వహించాలి. ప్రస్తుతం జ్యోతిరావు పూలే ప్రజాదర్బార్ ను ఇక నుంచి ప్రజావాణి గా పిలవాలని ఆదేశం. ప్రజావాణి లో వికలాంగులు ,మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలి.




Total views : 61635