అణిచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని గవర్నర్ తమిళి సై అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ తమిళి సై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. మీ ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని ప్రజాసేవలో విజయం సాధించాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. ప్రజావాణి కార్యక్రమంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పాలన మొదలయిందన్నారు. ప్రజల అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని రైతులు, యువత, మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మన ప్రభుత్వం దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని రెండు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామని తమిళిసై గుర్తు చేశారు. ప్రతి ఆడ బిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే ప్రభుత్వం ధ్యేయమన్నారు. వచ్చే వందరోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు.
Read Also..
Read Also..