తమిళగ వెట్రి కజగం TVK పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇవాళ విచారణకు హాజరు కావాలని సీబీఐ తాజాగా సమన్లు పంపించింది. సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో జరిగిన TVK పార్టీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. కేవలం 10,000 మందికి అనుమతి ఉన్న చోట సుమారు 30,000 మంది పైగా తరలివచ్చారు. విజయ్ రాక 7 గంటలు ఆలస్యం కావడంతో అభిమానులు ముందుకు దూసుకు రావడంతో ఈ విషాదం జరిగింది. 9 మంది చిన్నారులు, 18 మంది మహిళలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు . విజయ్ ఇప్పటికే జనవరి 12న తొలి విచారణ, జనవరి 19న రెండో విచారణ జరిగాయి.. రెండూ దాదాపు 6 గంటల పాటు కొనసాగాయి. ఈ విచారణలో విజయ్ — “తొక్కిసలాట ఘటనకు TVK పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు, పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతో తాను వెళ్లిపోయాను” అని సీబీఐకి స్టేట్మెంట్ ఇచ్చాడు . ఇదే కేసులో TVK పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్, ఎలక్షన్ మేనేజ్మెంట్ డివిజన్ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా సెక్రటరీ మతియఝగన్‌లను కూడా సీబీఐ ఇప్పటికే విచారించింది. ఈ నేపధ్యం లో ఇవాళ విజయ్ సీబీఐ కార్యాలయంలో హాజరవుతారా లేదా అన్న విషయంపై అందరి దృష్టి నెలకొంది.
political
ఒకే రోజు చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం:
ఏపీ(andhra pradesh)లో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్(CM Jagan), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో, ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలుపెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది.
ఇది చదవండి: ఈసారి కందుకూరులో చరిత్ర సృష్టించబోతున్నాం – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మంది బాధపడే ఒక సాధారణ సమస్య. ఇది శరీరానికి అందాన్ని దెబ్బతీయడమే కాకుండా, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.
Table of Contents
బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడానికి చాలా మంది డైట్, వ్యాయామం వంటివి చేస్తారు. కానీ చాలా సందర్భాలలో అవి ఫలితాన్ని ఇవ్వవు.
కానీ ఈ సింపుల్ 5-నిమిషాల మార్నింగ్ రొటీన్‌తో మీరు బెల్లీ ఫ్యాట్‌ని త్వరగా మరియు సులభంగా తగ్గించుకోవచ్చు.
Follow us at : Facebook, Youtube
ఈ రొటీన్(burn belly fat) లో ఏమున్నాయ్?
ఈ రొటీన్ లో మూడు ముఖ్యమైన భాగాలు ఉన్నాయి:
- వ్యాయామం: ఈ రొటీన్ లో కొన్ని సింపుల్ కానీ శక్తివంతమైన వ్యాయామాలు ఉన్నాయి. ఈ వ్యాయామాలు మీ కడుపు కండరాలను బలోపేతం చేయడానికి మరియు బెల్లీ ఫ్యాట్‌ని కరిగించడానికి సహాయపడతాయి.
- ఆహారం: మీరు ఏమి తినాలో మరియు ఏమి తినకూడదో తెలుసుకొని అవి పాటించడం ద్వారా మీరు మీ బరువును తగ్గించుకోవచ్చు మరియు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
- జీవనశైలి: మీ జీవనశైలిని మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవడానికి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి.
ఈ రొటీన్ ఎలా పనిచేస్తుంది?
ఈ రొటీన్ లోని వ్యాయామాలు మీ కడుపు కండరాలను బలోపేతం చేయడానికి మరియు బెల్లీ ఫ్యాట్(belly fat)ని కరిగించడానికి సహాయపడతాయి. ఈ రొటీన్ లోని ఆహార సలహాలు మీరు మీ బరువును తగ్గించుకోవడానికి మరియు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడతాయి. ఈ రొటీన్ లోని జీవనశైలి చిట్కాలు మీరు మీ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవడానికి మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి.
ఈ రొటీన్ ఎవరికి ఉపయోగకరం?
ఈ రొటీన్ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవాలనుకునే ఎవరికైనా ఉపయోగకరం. ఈ రొటీన్(belly fat) చాలా సులభం మరియు 5 నిమిషాలలో పూర్తి చేయవచ్చు. కాబట్టి, మీరు బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవాలనుకుంటే, ఈ రొటీన్‌ని ఈ రోజే ప్రారంభించండి.
- యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా? జర జాగ్రత్త…by Prakashయాంటీ బయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ | Antibiotics యాంటీ బయాటిక్స్(Antibiotics) అందుబాటులో ఉండడంతో ప్రజలు కామన్ కోల్డ్‌కి కూడా యంటీ బయాటిక్ వేసేసుకుంటున్నారు, లైవ్ స్టాక్‌కి ఇంజెక్ట్ చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్‌లో సరైన ప్రొసీజర్, పరిశుభ్రత ఉండడం లేదు. ఇవన్నీ…
- పనస పండు.. పోషకాలు మెండు…by Prakashపనస ఆరోగ్యానికి భరోసా(jackfruit)… పనసపండు, దీనిని “జాక్‌ఫ్రూట్”(jackfruit) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా గుర్తించబడుతుంది, ఒక్కో పండు 100 పౌండ్ల బరువు వరకు ఉంటుంది. పనసపండు చాలా పోషకమైనది, దీనిలో ప్రయోజనాలు మనకు తెలియక దూరంగా పెడుతుంటాం.…
- ఈ చిట్కాలతో సన్ స్ట్రోక్ కి బై బై చెప్పండి..by Prakashసన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ అంటే… | Sun Stroke or Heat Stroke బయట ఎండలు మండిపోతున్నాయ్ సన్ స్ట్రోక్ | హీట్ స్ట్రోక్ | వడదెబ్బ పేరు ఏదైనా దెబ్బ మాత్రం ఒక్కటే ! వేసవి…
రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు.
గత పాలన గురించి ప్రతిపక్ష సభ్యులు పదే పదే మాట్లాడుతున్నారు. అప్పటి ప్రభుత్వంలో ఇప్పటి ప్రతిపక్షాలదే ప్రధాన భాగస్వామ్యం. ఆ పాపాలకు సంపూర్ణ బాధ్యత ప్రతిపక్షాలదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మాట్లాడితే గత పాలనలో అలా జరిగింది ఇలా జరిగిందని విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పార్టీ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత ఎంపీగా, మంత్రిగా ఆయనను గౌరవించిందని గుర్తుచేశారు. హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలవకున్నా మంత్రిగా చేసి ఆపై ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. గత పాలనలో పాపాలు జరిగాయంటున్నారు. నిజంగానే పాపాలు జరిగి ఉంటే అప్పట్లో అధికారంలో భాగస్వాములుగా ఉన్నది మీరే కాబట్టి వాటికి సంపూర్ణ బాధ్యత కూడా మీదేనని కేటీఆర్ ఆరోపణలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన ప్రభుత్వం ఏం చేసింది. ఆర్థిక విధ్వంసం ఎలా జరిగింది, పదేళ్ల పాలనలో చేసిన వ్యవహారాలపై సంపూర్ణంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మీకు మనసుంటే తెలంగాణ అభివృద్ధిని నిజంగా కోరుకుంటే మా పాలనకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ చదివిన గవర్నర్ ప్రసంగానికి అభినందలు తెలపాలని అన్నారు.
అణిచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని గవర్నర్ తమిళి సై అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ తమిళి సై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. మీ ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని ప్రజాసేవలో విజయం సాధించాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. ప్రజావాణి కార్యక్రమంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పాలన మొదలయిందన్నారు. ప్రజల అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని రైతులు, యువత, మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మన ప్రభుత్వం దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తోందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని రెండు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేశామని తమిళిసై గుర్తు చేశారు. ప్రతి ఆడ బిడ్డను మహాలక్ష్మిగా చేయాలనేదే ప్రభుత్వం ధ్యేయమన్నారు. వచ్చే వందరోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కార్యాచరణ రూపొందిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు.
Read Also..
Read Also..
అన్నమయ్య జిల్లా.. రాయచోటి.. సూపర్ స్పెషాల్టి హాస్పిటల్ స్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందన్నారు, అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్. రాయచోటి పట్టణం నందు 23 కోట్లతో తుది దశకు చేరుకున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణంను అసుపత్రి సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్, ఇంజనీరింగ్ శాఖ డిఈఈ రాజగోపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ కార్తీక్ లతో కలిసి వారు ఆసుపత్రి ప్రాంగణంలో ని రోడ్లను భవన నిర్మాణాలను పరిశీలించి పలు విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల వైద్య సదుపాయాల కోసం కేటాయించిన గదుల తో పాటు ఆపరేషన్ థియేటర్, లిఫ్ట్, ల్యాబ్, రిసెప్షన్ లను కూడా పరిశీలించారు. సుమారు 40 లక్షల రూపాయల నిధులతో అదనంగా నిర్మిస్తున్న ఐపిహెచ్ ల్యాబ్ ను, 25 లక్షల నిధులతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం పనులను నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం రోజున ప్రారంభం చేసి రోగులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారన్నారు. అయితే ఇంజినీరింగ్, గుత్తేదారులు ఒక వారం సమయం ఇచ్చినట్లయితే నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని తమకు తెలియజేసారన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వారి నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాతనే వారి నిర్ణయాన్ని మీకు స్పష్టం తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రోగ్రాం డైరెక్టర్ సాయి, వైకాపా నాయకులు అన్నా సలీం, బేపారి జబి బుల్లా ఖాన్ పాల్గొన్నారు.
రైతు బ్రతికుండగానే డెత్ సర్టిఫకెట్ పుట్టించి భూ మార్పిడి చేసిన రెవెన్యూ అధికారులు.
*ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు.
- సంబంధిత తహశీల్దార్ ని CVR NEWS వివరణ కోరగా గ్రామ vro మరియు RI పర్యవేక్షణ చేసిన తర్వాత ఫైల్ నాదగ్గరకు వస్తుంది అంటూ చెపుతున్న తహశీల్దార్.
- VRO ని కాని RI ని కాని కనుక్కోండి అంటూ సమాధానం దాటవేస్తున్న తహశీల్దార్.
- అసలైన రైతులకు అన్యాయం జరుగుతున్నా రైతులు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్న ఏమి పట్టనట్టు ధనార్జనే ద్యేయంగా అధికారులు పనిచేస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పై అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందిస్తామని దానికొరకు గ్రామ సచివాలయాలను తీసుకొచ్చినా చివరికి తహశీల్దారు ఆఫీస్ కు వెళ్లాల్సిందే. అలాంటపుడు సచివాలయాలు ఎందుకు అంటున్నరైతులు. కంబదూరు మండలంలోని కర్తనపర్తి గ్రామానికి చెందిన కురుబ కరెన్న చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ పుట్టించి అతని భూమి నుతిమాడుగు గ్రామానికి చెందిన పింజరి బాబుకు కరెన్నను ఫ్యామిలీ సర్టిఫికెట్ లో పింజరీ బాబును కుటుంబసభ్యునిగా రికార్డు పుట్టించి పింజరి బాబుకు భూమి రాసి ఇచ్చినట్టు రెవెన్యూశాఖ లో ఆన్లైన్ నమోదు ఐనట్టు చూపిస్తున్న అడిగిన వారిని RDO office complaint చేసుకోండని చెపుతున్న అధికారులు ఇదే విషయమై cpi మండల కన్వీనర్ బోయ తిరిపాల్ మీడియా ముఖంగా ఆధారాలతో సహా వెల్లడించారు.
Read Also…
Read Also…
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు శాఖలకు
భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన దస్త్రాలపై భట్టి సంతకాలు చేశారు. ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన సబ్సిడీ కింద 374 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 298కోట్లు, విద్యుత్ సబ్సిడీకి 996 కోట్లు, మేడారం జాతర ఏర్పాట్లకు 75 కోట్ల నిధులను విడుదల చేస్తూ సంబంధిత ఫైల్స్ పై భట్టి విక్రమార్క సంతకాలు చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 14న రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దినసరి అనసూయ సీతక్క నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ హనుమంత రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.




Total views : 54700