76
ఏలూరు జిల్లా ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని, దెందులూరు శాసనసభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు నగర జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి, తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా సమన్వయకర్త పాలి ప్రసాద్, ఏలూరు నగర టిడిపి ఇన్చార్జి బడేటి చంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ అదేవిధంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు షేక్ సాబ్జి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.