65
అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై ఉరవకొండ అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసారు. అనుమతి లేకుండా రోడ్డు పై బైఠాయించినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు అయితే GBC కెనాల్ కు నీటినీ వదలకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణమే నీటిని వదిలి 30 వేల ఎకరాలలో పంటలను కాపాడాలనీ అయా గ్రామాల రైతులతో కలసి, అనంతపురం – బళ్ళారి జాతీయ రహదారి పై హంద్రీ నీవా కెనాల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే కేశవ్ తో పాటు మరో ఇద్దరి పై పోలీసులు కేసు నమోదు చేశారు.