జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద గంగపుత్ర సోదరులకు జీవనదారం అయిన చేప పిల్లల పంపిణి లో గత ప్రభుత్వం నాసిరకం చేపలు పంపిణి చేసి తమ నోట్లో మట్టి కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం జగిత్యాల సమీపంలో గల ముప్పాలా చెరువు, తిమ్మాపూర్ చెరువు, రాజుల చెరువు లో రవ్వులు అనే ఫిష్ సీడ్ ఇస్తామని పేర్కొని సిల్వర్ ఫిష్ అని ఏదో కొత్త రకం చేప సీడ్ పోశారని ఏడాది కాలంగా ఇవి పెరగడం లేదన్నారు. రవ్వులు, బొచ్చేలు, బంగారు తీగ సీడ్ ఇస్తామని చెప్పి, చివరికి సిల్వర్ ఫిష్ సీడ్ ఇచ్చారని వీటిని వ్యాపారులు గాని, ప్రజలు గాని కొనడం లేదని తాము నష్టపోతున్నామని వాపోయారు. గతంలో నుండి సకాలంలో చేప పిల్లలు పోయాక తాము ఇబ్బదులు ఎదురుకుంటున్నామని, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణితో తమ జీవితాలని మారుస్తామన్నా KCR ప్రభుత్వం, తమను మోసం చేసిందని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. నూతన ప్రభుత్వం అయిన మా పరిస్థితి అర్థం చేసుకొని బాధ్యుడైనా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోని, తమకు నాణ్యమైన చేపలు పంపిణి జరిగేలా చూడాలని గంగపుత్రులు అధికారులు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నాసిరకం చేపలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగపుత్రులు..
86
previous post