41
కాళేశ్వరం ప్రాజెక్టును 80వేల కోట్ల రూపాయలతో కట్టామని చెప్పడం శుద్ధ అబద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కార్పోరేషన్ రుణమే 97,448 కోట్ల రూపాయలు మంజూరయిందని, ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి మరీ అప్పులు తీసుకు వచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటితో ప్రతి సంవత్సరం 5 వేల కోట్ల రూపాయలు సంపాదిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మిషన్ భగీరథతో రూ.5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పినట్లు తెలిపారు.