125
మందమర్రి పట్టణ INTUC కార్యాలయంలో మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే 80 శాతం కల్పించాలని గెలిచిన 20 రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందించి జీవో వచ్చే విధంగా కృషి చేసినందుకు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటానికి పాలాభిషేఖం చేసి కృతజ్ఞతలు తెలిపారు.