చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో క్రిస్మస్ కార్నివాల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పైన ఏడుకొండల రెడ్డి పాల్గొని విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు 48 క్రిస్మస్ కార్నివాల్ స్టాల్స్ ను ఏర్పాటు చేసి స్కూల్ ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు, స్కూలు యాజమాన్యం, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపల్ నర్గీస్ క్వాజి లు పాల్గొన్నారు.
ఘనంగా క్రిస్మస్ కార్నివాల్ వేడుకలు..
69
previous post