ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా పరిపాలన చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పంచముఖ నాగేంద్ర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. గతంలో ఈ ఆలయానికి నాలుగుసార్లు వచ్చానని తెలిపారు. ఎన్నికల తర్వాత వచ్చి మొక్కు చెల్లించుకుంటానని చెప్పానని, అందువల్లనే వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నానని తెలిపారు. ఆలయంలో ఇంకుడు సమస్య ఉందని పూజారులు తెలిపారని, తప్పకుండా నాగేంద్రస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్పస్వామి భక్తులు కేరళకు వెళ్తారని, వారికి తగిన సదుపాయాలు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. భక్తులు తిరిగి తమ ఇళ్లకు సురక్షితంగా చేరే విధంగా కేరళ ప్రభుత్వ విధి విధానాలు చేపట్టాలని మంత్రి సీతక్క కోరారు.
ప్రజా సేవకే సీతక్క..
43
previous post