చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. గోళ్ళు కొరకడం తిరిగి వాటిని నమలడం చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది గోళ్లను కొరికి, నములుతారు. ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది దారి తీస్తుంది. అయితే అది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం. గోళ్లు కొరకడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఎర్రగా అయిపోవడం, వాపులు రావడం మొదలైనవి వస్తాయి. అలానే ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా చీము మరియు ఎక్కువగా నొప్పి రావడం కూడా జరుగుతాయి. ప్రతి రోజు మీకు ఈ అలవాటు ఉంటే మీ గోళ్ళని అది పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. పళ్ళకి నష్టం కలుగుతుంది. అలానే గోళ్ళని కొరకడం కారణంగా పళ్ళను కూడా పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. పళ్ళు ఊడిపోవడం లాంటివి కూడా దీని కారణంగా సంభవిస్తాయి. అంతే కాదండి తరచు కొరకడం వల్ల వంగి పోతాయి. గోళ్లు పళ్లలో ఇరుక్కుపోయి దంతాల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలకు దారి తీస్తుంది. తద్వారా దంతాలకు నొప్పి వస్తుంది.
గోర్లు కొరుకుతున్నారా.. ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదు!
79
previous post