ముఖం తెల్లగా ఉండి కాళ్లు, చేతులు నల్లగా ఉంటాయి. ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లు దగ్గర నల్లగా ఉంటే అవి తెల్లగా మార్చుకోవడానికి ఈ చిట్కా మీ కోసం. మోచేతులు, మోకాళ్లు మెరిసిపోవడం కోసం ముందుగా ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఒక చెంచా నిమ్మరసం ఒక చెంచా పంచదార వేసి మిశ్రమాన్ని చేతులకు రాసి నిమ్మ చెక్కతో మసాజ్ చేస్తూ రుద్దాలి. ఆ తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూను బియ్యం పిండి, కొద్దిగా బేకింగ్ పౌడర్, చిటికెడు పసుపు, అర స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారుచేసుకున్న ప్యాక్ ను మోచేతులు, మోకాళ్లు పై నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. పది నిమిషాల తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని రసం పిండేసి ఆ తొక్క తో మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసినా నెలలో నాలుగు సార్లు చేసినా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నాయా.. ఈ చిట్కా మీ కోసం!
52
previous post