106
ఆన్ లైన్ మోసాలు, సైబర్ స్కామ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన దీక్షిత్ అనే యువకుడు ఆన్ లైన్ మోసాల బారిన పడి 18 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ విషయమై దీక్షిత్ జిల్లా పోలీసుల కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. టెక్నికల్ టీమ్ సిబ్బంది విచారణ చేసి 13 లక్షల రూపాయల నగదు వసూలు చేసి బాధితుడికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. గతంలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం జరిగిందని ఎస్పీ తెలిపారు.