పైల్స్ సమస్య అనేది అనేక కారణాల వల్ల వస్తుంటుంది. మాంసాహారం ఎక్కువగా తినడం, అధిక బరువు, గంటల తరబడి కూర్చుని ఉండడం, డయాబెటిస్, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల పైల్స్ వస్తుంటాయి. పైల్స్‌ను తగ్గించుకునేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు. రోజూ ఉదయాన్నే పరగడుపునే 3 లేదా 4 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పెనంపై వేసి వేయించి వాటిని అలాగే తినండి. నేరుగా తినలేం అనుకుంటే తేనెతో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం నుంచి బయట పడతారు. మలబద్దకం తగ్గి పైల్స్ నుంచి విముక్తి పొందవచ్చు. బాదంపప్పులో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పును రోజూ తింటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. బాదంపప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని పొట్టు తీసి తినాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడంతోపాటు మలబద్దకం తగ్గుతుంది. కిస్మిస్లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తినండి. దీంతో మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.
పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహారం తినండి!
97
previous post