పాలకూరలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు లభిస్తాయి. పాలకూరలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. పాలకూరను జ్యూస్ రూపంలో రోజు ఉదయాన్నే పరగడుపునే ఒక కప్పు మోతాదులో తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. పాలకూరలో మెదడు పనితీరుకు అవసరం అయ్యే పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని తింటే మెదడు చురుగ్గా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరంలో రక్తహీనత సమస్య తగ్గుతుంది. బలహీనంగా ఉన్న పిల్లలు పాలకూర మంచి బలాన్ని అందిస్తుంది. పాలకూర రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయ పడుతుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. జుట్టు, చర్మం ఆరోగ్యంగా కూడా పాలకూర చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలకూరలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పాలకూరను తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు లైంగిక చర్యలో చురుగ్గా పాల్గొంటారు. పాలకూరను రోజూ నేరుగా వండుకుని తినవచ్చు. లేదా జ్యూస్ రూపంలో ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. సూప్స్, సలాడ్స్ రూపంలోనూ తీసుకోవచ్చు.
పాలకూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
101
previous post