బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమర్పించింది. రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందేనని స్పష్టం చేసింది. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయని భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరమని తెలిపింది. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలని అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయని కమిటీ స్పష్టం చేసింది. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్‌ను సమర్పించాలని పేర్కొంది. అయితే ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు. ముసాయిదాను క్షుణంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని సీఎం తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం నిషేధం
88
previous post