నెల్లూరు జిల్లాలో విషజ్వరాలు వణికిస్తున్నాయి. దుత్తలూరు మండలం ఎరుకొల్లు గ్రామంలో విషజ్వరాల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎరుకొల్లులో దాదాపు 50 మంది విషపు జ్వరాల బారిన పడ్డారు. గ్రామంలో రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, పంచాయితీ, వైద్య సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. వైద్య సిబ్బంది వచ్చి ఆదుకుంటారని గ్రామస్తులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పూర్తిస్థాయి వైద్యం అందడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కార్పోరేట్ హాస్పిటల్స్ కు వెళ్లలేక ఊరిలోనే ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.