శామీర్ పేట రెవెన్యూ శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. పట్టాదారు పాస్ బుక్ జారీ కోసం రూ. 30 లక్షలు డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా శామీర్ పేట తహసీల్దార్ సత్యనారాయణ , అతని డ్రైవర్ అడ్డంగా బుక్ అయ్యారు. హైదరాబాద్, గచ్చిబౌలి కి చెందిన రామశేషగిరిరావుకు శామీర్ పేట్ మండలంలోని లాల్ గడి మలక్ పేట లో 29 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. ఆయన పట్టదారు పాసుబుక్ లు, ధరణిలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్ కు అనుకూలంగా రిపోర్టు రాసేందుకు గాను తాహసీల్దార్ సత్యనారాయణ రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో రామ శేషగిరిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం డబ్బులు రెడీ అయ్యాయని తాహసీల్దార్ కు శేషగిరిరావు సమాచారం ఇచ్చాడు. దీంతో సత్యనారాయణ తన డ్రైవర్ పి.భండారిని డబ్బులు తీసుకోవాల్సిందిగా ఆదేశించాడు. రూ.10 లక్షల నగదుతో పాటు, రూ.20 లక్షలకు సంబంధించిన చెక్కును తీసుకొని డ్రైవర్ తాహసీల్దార్ కు ఇస్తుండగా, పక్కా ప్లాన్ తో ఏసీబీ డీసీపీ మజీద్ అలీఖాన్ , ఇతర ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.