Chhatrapati Shivaji Jayanti :
స్త్రీని గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ అని రాచవీడు అయ్యప్ప సేవా సొసైటీ సభ్యులు కొనియాడారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాచవీడు అయ్యప్ప సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఛత్రపతి విగ్రహంతో శోభ యాత్ర (బైక్ ర్యాలీ) నిర్వహించారు. యాత్ర నాయి బ్రాహ్మణ కాలనీ లోని శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప సేవ సొసైటీ సభ్యులు ఈ శోభ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర జగదాంబ సెంటర్, మదనపల్లె రోడ్, శివాలయం, బంగ్లా సర్కిల్ వైఎస్ఆర్ సర్కిల్ మీదగా మాండవ్య నది తీరాన వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ యాత్రలో హిందూ సోదరులు భారీగా పాల్గొన్నారు. జై శివాజీ…జైజై శివాజీ, భారత మాతాకీ జై, భవానీ మాతాకు జై అంటూ నినాదాలతో పలు పురవీధులలో ఈ ర్యాలీ నీ కొనసాగించారు. ఈ ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై భక్తవత్సలం వారి సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.