పల్నాడు జిల్లా (Palnadu) నరసరావుపేటలో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు జరిగాయి. రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నారు వైసీపీ, టీడీపీ ఎంపీ అభ్యర్థులు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించనుంది టీడీపీ అధిష్టానం. ఇప్పటికే నారా చంద్రబాబుతో రెండుసార్లు భేటీ అయ్యారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. టీడీపీ పార్టీలోకి చేరకముందే డాక్టర్లు, వ్యాపారస్తులు, న్యాయవాదులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు ఎంపీ లావు. అయితే నెల్లూరువాసులు నరసరావుపేటలో పోటీ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ అందరిలోనూ ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరుకి చెందిన.. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయనున్నారు. నరసరావుపేటలో భారీ ఎత్తున అనిల్ కుమార్ యాదవ్ కు ఆహ్వాన సభ నిర్వహించారు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్చార్జిలు. గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట ఎంపీలుగా గెలుపొందారు. వైసీపీ ఎంపీగా గెలిచిన లావు కృష్ణదేవరాలకి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మంచి పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గెలిచారు. 2024 ఎన్నికలకు టీడీపీ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.