చత్రపతి శివాజీ (Chatrapathi Shivaji) జయంతి:
శ్రీశైలం క్షేత్రంలో చత్రపతి శివాజీ మహరాజ్ 394వ జయంతి వేడుకలను శ్రీశైలం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు వేడుకలో భాగంగా వందకు పైగా ద్విచక్ర వాహనాలతో శివాజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దేవస్థానం పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. శోభాయాత్రలో గ్రామస్థులు కాషాయం కండువా, టోపీలు ధరించి శివాజీ మహరాజ్ కు జైజైలు కొడుతూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆలయం ముందు భాగంలో ప్రారంభమైన ఈ శోభాయాత్ర నందిమండపము, ఉద్యోగుల వసతి భవనాలు, మల్లికార్జునసదన్, శ్రీగిరికాలనీ, రుద్రాక్షమఠం గుండా శివాజీ స్పూర్తి కేంద్రానికి చేరుకున్నారు. శివాజీ స్పూర్తి కేంద్రంలో నిర్వహించిన సభలో చత్రపతి శివాజీ మహరాజ్ చరిత్ర, హిందూ సామ్రాజ్యా ఏర్పాటుకు ఆయన చేసిన యుద్ధాలు, వీరోచిత పోరాటాలను కొనియాడారారు. జయంతి సందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను పంపిణీచేశారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.