అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అనంతపురం జిల్లాలోని గుత్తి, అనంతపురం, ధర్మవరం తాడిపత్రి రైల్వే స్టేషనులను పునరాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గుత్తి రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన వర్చువల్ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్ గుప్తా, బిజెపి నాయకులతోపాటు గుత్తి రైల్వే అధికారులు, ఉద్యోగులు మరియు ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్ మేనేజర్ సురేష్ ,ఐఓడబ్ల్యూ ఆఫీసర్ నాగేశ్వర నాయక్, బుకింగ్ సూపర్వైజర్ శ్రీనివాసులు, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ మీనా కుమారి అధ్యక్షత వహించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ముందుగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సంధర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 40వేల కోట్లతో దాదాపు 554 రైల్వే స్టేషన్ లో పునరాభివృద్ధి మరియు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు మరియు అండర్ పాసస్ లు నిర్మించడం ఎంతో ఆనందంగా ఉన్నారు. కేవలం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని గుత్తి, తాడిపత్రి మరియు అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం సంస్కృతి కార్యక్రమాలలో అలరించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందించారు.
ఇది చదవండి: పోలీసు వృత్తి కత్తి మీద సాములాంటిది..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.