టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మొదటిసారి హైదరాబాద్ కు వచ్చారు. నగరంలో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ని – ఐడీసీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బిల్ గేట్స్ పాల్గొన్నారు. కృత్రిమ మేధ – ఏఐ భారత్‌కు అతిపెద్ద అవకాశమన్న బిల్ గేట్స్ అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఏఐ ఆధారిత క్లౌడ్, సెక్యూరిటీ, గేమింగ్ విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం ఐడీసీ కృషి చేస్తోందని ఎండీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఐడీసీ ఇంజనీర్లతో బిల్ గేట్స్ మాట్లాడారని మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల కూడా ఇటీవల భారత్‌లో పర్యటించారని, ఏఐ సాంకేతికత ఇండియాలో కీలకమవుతుందని రాజీవ్ కుమార్ అన్నారు.
మొదటిసారి హైదరాబాద్ కు బిల్ గేట్స్…
122
previous post