మార్కెట్ లో నేటి జెండాపాటకు కేవలం ముగ్గురు కొనుగోళ్లు దారులు వచ్చి మమా అనిపించి, రైతుల నోట్లో మట్టి కొట్టారని, జెండా పాట 21600 ఉండగా కొనుగోళ్లు మాత్రం కేవలం 14 నుంచి 16 లోపే చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మిర్చి క్వాలిటీ లో తేడా ఉంటే క్వింటాకు 500,1000 రూపాయలు ఉండొచ్చు కానీ, దారుణంగా 5000 నుంచి 6000 రూపాయలు తగ్గించి రైతు నోట్లో మట్టి కొడుతున్నారని అన్నారు. లైసెన్స్ ఉన్న ఖరీదు దారులు 168 మంది, అక్రమంగా ఖరీదు చేసే వ్యాపారులు 150 మంది ఉండగా నేటి జెండా పాటకు ముగ్గురు మాత్రమే ఎలా వస్తారని, ఖమ్మం మార్కెట్ దోపిడీ కి అడ్డాగా మారిందని ఆరోపిస్తున్నారు. రేపు ఎల్లుండి సెలవు కావడంతో దళారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్కై రైతు నడ్డి విరుస్తున్నారని అన్నారు. గిట్టుబాటు ధర జెండా పాట ప్రకారం ఇవ్వాలని, అప్పటి వరకు ఖాంటాలు నిలిపివేయాలని మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. విషయం తెలిసుకొని అక్కడకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్ లను రైతులు నిలదీశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: లాస్య కారును ఢీకొన్న టిప్పర్ను గుర్తించిన పోలీసులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి