ఐలయ్య యాదవ్ (Ailaiah Yadav) :
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ రైతులపై అటవీ అధికారుల వేధింపులు మానుకొని, గిరిజన రైతులను బెదిరించకుండా వారిపై ఉన్న కేసులను ఎత్తివేయాలని రాచకొండలో ఎండిపోయిన వరి పంటలను టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాక్కిలి ఐలయ్య యాదవ్ పరిశీలించారు. అనంతరం గిరిజన రైతులు మాట్లాడుతూ రాచకొండ ప్రాంతంలోని తండాల్లో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీ మాకు ఇక్కడ భూములను అందించారు. పాస్ బుక్కులు అన్నీ ఉన్నా గాని తెలంగాణ వచ్చాక బిఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. మా భూముల్లో మమ్మల్ని వెళ్ళనీయకుండా ఇబ్బందులకు గురి చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పూర్తి హక్కు పొందేలా చూడాలని అలాగే భూగర్భ జలాలు అడుగంటడంతో చేతికి వచ్చిన పంట నష్టం అవుతుందని మళ్లీ కొత్తగా బోర్ వెయ్యాలన్న అటవీ అధికారులు మాకు అనుమతి ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారు. కావున మా పంట నష్టపోకుండా న్యాయం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జక్కిలి ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ఎండిపోతున్న వరి పంటను కాపాడుకోవడం కోసం బోర్లు వేద్దామనుకుంటున్న రైతులను అడ్డుకుంటున్న అటవీ అధికారులు. అటవీ అధికారుల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు.. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు రైతులకు భూములు ఇస్తే భూమి రికార్డుల ప్రక్షాళన పేరుతో ధరణి తో పాత పట్టా పాస్ బుక్కులను నిలిపివేసి బిఆర్ఎస్ ప్రభుత్వం రాచకొండ రైతులను ఇబ్బందులకు గురిచేసింది. నూతన ప్రభుత్వం రాచకొండ భూ సమస్యలను పరిష్కరించాలి. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి