నంద్యాల జిల్లా(Nandyala District):
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహా శివరాత్రి(Mahashivratri) బ్రహ్మోత్సవాల(Brahmotsavala) సంబరాలు అంబరాన్నంటాయి. భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy) గజా వాహనం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy) అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో గజా వాహనంలో ఆవహింపజేశారు. అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలివేళ్ళగా, రాజగోపురం గుండ గజా వాహనం స్వామి అమ్మవార్లను ఊరేగించారు. బాజా బజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహారించేందుకు గజా వాహానంపై స్వామి అమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వాహనసేవ పూజ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, దేవస్థానం చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఇది చదవండి: మహాశివరాత్రి ఉత్సవాలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి