కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Government Employees):
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏను 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2024 నుంచి ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ వర్తిస్తాయి. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం(Decision of Central Govt)..
కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల 49లక్షల18వేల మంది ఉద్యోగులకు, 67లక్షల95 వేల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నిర్ణయం వల్ల ఖజానాకు ప్రతి ఏటా రూ.13 వేల కోట్ల భారం పడుతుందన్నారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు పెంపుదల ఉంటుందని తెలిపింది. కాగా, కేబినెట్ సమావేశంలో ఏఐ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం(Central Govt) 10వేల కోట్లు కేటాయించింది. ముడి జనపనారకు మద్దతు ధరను 285కు పెంచింది. ముడి జనపనారకు క్వింటాల్‌కు కనీస మద్దతు ధరను 5వేల335గా నిర్ధారించింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీ
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి