కోదాడ పట్టణంలో డ్రగ్స్ కంట్రోల్ డీజీ కమల్హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు మెడికల్ షాపుల్లో అధికారులు ఏక కాలంలో దాడులు (Officials raids) చేశారు. మూడు బృందాలుగా ఏర్పడి డ్రగ్స్ (drugs) మోతాదు అధికంగా ఉండే మందులను తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన మందులను విచ్చలవిడిగా మెడికల్ షాపుల్లో లభ్యం అవుతుండటం దాడులకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కోదాడ పరిసర ప్రాంతాలల్లోని మెడికల్ షాపుల్లో డ్రగ్స్ మోతాదు అధికంగా ఉండే దగ్గు మందు సీసాలు, టాబ్లెట్లను ఆబ్కారీ శాఖ, జిల్లా డ్రగ్స్ అధికారులు పట్టుకున్న నేపథ్యంలో దాడులు ప్రాధన్యం సంతరించుకున్నాయి. డిప్యూటీ డైరెక్టర్ రాజవర్ధనచారి, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ఏడీసీలు దాస్, ప్రసాద్, వరంగల్, కమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి డీఐలు ఈ దాడుల్లో పాల్గొన్నారు. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో వివరాలు తనిఖీల అనంతరం వివారిస్తామని అధికారులు వెల్లడించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: కలకలం రేపుతున్న యువకుడి హత్య..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి