అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్న జో బైడెన్(Joe Biden), డొనాల్డ్ ట్రంప్(Donald Trump)…
ఈ ఏడాది నవంబర్‌లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్(Joe Biden), డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పోటీ పడనున్నారు. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. తాజాగా జార్జియా ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ గెలుపొంది డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. పార్టీ నుంచి నామినేట్ కావడానికి అవసరమైన ప్రతినిధులను జో బైడెన్ పొందారు. అటు వాషింగ్టన్, మిస్సిసిపీ, నార్తర్న్ మరియానా, ఐలాండ్స్‌లోనూ ఆయన విజయఢంకా మోగించడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
జార్జియా ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ విజయం..
జార్జియాలో విక్టరీ తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు. ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలో ఉంది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా? మన భద్రతను, స్వేచ్ఛను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని దూరం చేసేవారికి అవకాశం ఇస్తారా? అని బైడెన్(Biden) అన్నారు. కాగా, వాషింగ్టన్లోనూ విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు.
రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం బరిలో బైడెన్, ట్రంప్..
దీంతో ట్రంప్(Trump) తన నామినేషన్‌కు కావాల్సిన ప్రతినిధుల మద్దతు కూడగట్టుకున్నారు. మరోవైపు మరికొన్ని ప్రైమరీ ఎన్నికల్లోనూ ఆయన విజయం ఖాయంగానే కనిపిస్తోంది. అలాగే చివరి వరకు ట్రంప్(Trump)కు పోటీగా ఉన్న నిక్కీ హేలీ కూడా రేసు నుంచి తప్పుకున్నారు. ఇలా నిక్కీ హేలీ రేసు నుంచి తప్పుకోవడంతో ట్రంప్‌కు మార్గం సుగమమైంది. దీంతో జో బైడెన్(Joe Biden), డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధ్యక్ష పీఠం కోసం బరిలో దిగనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: లోయలో పడి తెలుగు వైద్యురాలు మృతి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి