పదో తరగతి పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా ..
పదో తరగతి పరీక్షల(10th class exams)కు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుతించాలని తెలంగాణా ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించింది. ఇంతకు మించి లేటుగా వస్తే మాత్రం పరీక్ష కేంద్రంలోకి పంపించబోమని స్పష్టం చేసింది. ఈ నెల18 నుంచి పదవ తరగతి పరీక్షలు(10th class exams) ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చివరి నిమిషంలో ఇబ్బంది తలెత్తకుండా విద్యార్థులు పరీక్షా సమయానికంటే ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని బోర్డు సూచించింది. గతంలోలా ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా చూసేందుకు బోర్డు పలు చర్యలు తీసుకుంది. పేపర్ కోడ్, సబ్జెక్టు, మీడియం వంటివి తప్పుగా వచ్చినట్టైతే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను సంప్రదించాలని సూచించింది.
ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి