తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి..
తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద తొలి భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి మూడు పార్టీల శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా తరలి రానున్నారు. పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభను కనీవిని ఎరుగని రీతిలో అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజాగళం బహిరంగ సభ కోసం టీడీపీ ఆధ్వర్యంలో మూడు పార్టీల ముఖ్యనేతలతో ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. మూడు పార్టీలు బహిరంగసభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సభకు లక్షలాది మంది తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సభ నిర్వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు పొరుగు జిల్లా బాపట్ల నుంచి అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు, పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనం తరలిరావడానికి ఏర్పాట్లు చేశారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి సభకు వచ్చేవారికి రవాణా సౌకర్యాలు కల్పించారు. చిలకలూరిపేట పరిసర నియోకవర్గాల నుంచి ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, ఆటోల్లో పెద్దఎత్తున వస్తారని అందుకు అనుగుణంగా పార్కింగ్ వసతి కల్పించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేనలతో పొత్తు ఖరారయ్యాక జరుగుతున్న తొలి బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.
ఇది చదవండి: ప్రజా గళం బహిరంగ సభ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి