Bapatla
రాష్ట్రంలో అరాచకపాలనకు స్వస్తి పలికి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని బాపట్ల నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్ధి వేగేశ్న నరేంద్ర వర్మ (Vegesana Narendra Varma) ఆశాభావం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వంలో ఆంధ్రరాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. బాపట్ల నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఎక్కడ అభివృధ్ధి జరగలేదని, అవినీతి మయం ఎక్కువైందని దుయ్యబట్టారు. తనకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ప్రజలకు ఎంఎల్ఏ గా కాకుండా… సేవకుడిగా పనిచేస్తానన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి తరుపున అత్యధిక మెజారిటీతో బాపట్ల నియోజకవర్గంలో గెలిచి తమ ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అభివృధ్ధి పథంలో నడిపిస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
- సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
- భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి..
తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద తొలి భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి మూడు పార్టీల శ్రేణులు, ప్రజలు ఉత్సాహంగా తరలి రానున్నారు. పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభను కనీవిని ఎరుగని రీతిలో అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజాగళం బహిరంగ సభ కోసం టీడీపీ ఆధ్వర్యంలో మూడు పార్టీల ముఖ్యనేతలతో ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. మూడు పార్టీలు బహిరంగసభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సభకు లక్షలాది మంది తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సభ నిర్వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు పొరుగు జిల్లా బాపట్ల నుంచి అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలు, పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జనం తరలిరావడానికి ఏర్పాట్లు చేశారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి సభకు వచ్చేవారికి రవాణా సౌకర్యాలు కల్పించారు. చిలకలూరిపేట పరిసర నియోకవర్గాల నుంచి ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, ఆటోల్లో పెద్దఎత్తున వస్తారని అందుకు అనుగుణంగా పార్కింగ్ వసతి కల్పించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేనలతో పొత్తు ఖరారయ్యాక జరుగుతున్న తొలి బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.
ఇది చదవండి: ప్రజా గళం బహిరంగ సభ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం సుగ్గ లంక గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి నిరాశలైన వారికి వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి రామకృష్ణ తన వంతు ఆర్థిక సహాయం కింద 5000 రూపాయలు నిత్యావసర సరుకులు. ఒక రైస్ బ్యాగ్ అందజేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఏ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది వీఆర్వో సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా C I మాట్లాడుతూ పెద్ద వయసులో ఉన్న వారిని వారి కుమారులు, కుమార్తెలు జాగ్రత్తగా చూసుకోవాలని గ్యాస్ బండ లీక్ అవటంతో గ్యాస్ బండ ఒక్కసారిగా పేలిపోయింది గ్యాస్ వాడే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్ద వయసు తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కుమారులపై ఉందని ప్రతి పేదవాడికి సహాయం అందించే విషయంలో ముందుంటారని ఆపదలో ఉన్నవారికి ఒకరికి ఒకరు సహాయం తీసుకోవాలని గ్రామస్తులకు పలు సూచనలు ఇచ్చారు.
బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దోంగలు అలజడి చేసారు. కంకటపాలెం గ్రామం పోలేరమ్మ దేవస్థానంలో రాత్రి అమ్మవారి నగలు, హుండీ అపహరణకు గురయ్యాయి. గుడిలోని ఏ సామాగ్రిని వదలకుండా మొత్తం దోచుకున్నారు దొంగలు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలుసుకొని ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు పోలీసులు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్ల పట్టణంలోని విలియం బూత్ జూనియర్ కాలేజీలో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో 2023 గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్త ప్రసంగీకులు డాక్టర్ వి రంగరాజు,ప్రముఖ సినీ గాయని ఎం ఎం శ్రీలేఖ, ప్రముఖ సంగీత విధ్వంసుడు జె క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేగేసిన మాట్లాడుతూ ప్రపంచమంత జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని, ఈ క్రిస్మస్ వేడుకలను గత ఆరు సంవత్సరాల నుంచి బాపట్లలో నేను నిర్వహిస్తున్నానని, ఆ జీసస్ దయవల్ల ఈ కార్యక్రమాన్ని నేను చేయగలుగుతున్నాను అని అన్నారు. జీసస్ దీవెనలు బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని ఆయన ఆ జీసస్ ని వేడుకొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ భారీ కేక్ కట్ చేసి అనంతరం రాజమండ్రి వారి ఆధ్వర్యంలో భారీ బాణాసంచా, క్రాకర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల జమ్ములపాలెంలోని ఎస్టీ కాలనీలో గిరిజనుల పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేశారు. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని తెలిపారు. కాలనీలో రహదారి లేక రోజుల తరబడి బురదలోనే తిరిగామని వాపోయారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదని చంద్రబాబుకు వివరించారు. వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా విన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ ఎస్టీ కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాలతో కూడిన కిట్లు పంపిణీ చేశారు.అంతేకాదు, టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మిచౌంగ్ తుఫాను కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షలు వరదలకు జన జీవనం వక్క సారిగా స్తంభించిపోయింది. కనీస నిత్యవసరాలు, కరెంటులేక, నీళ్లురాక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, మంత్రి బాధితులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ… తుఫాను ప్రభావంతో అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు మేలు చేయాల్సింది మరిచి ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడటం సవాబ్ కాదు అన్నారు. మీకు చేతనైంది మీరు చేయండి అని ఆనందబాబుకు సవాళ్లు విసిరారు. మీ ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ అన్నారు. అదే మన ముఖ్యమంత్రి వ్యవసాయం పండగానే నినాదంతో ప్రతి రైతుకు సాయం అందిస్తారని విమర్శించారు.
Read Also…
Read Also…
మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో అరటిపంట ధ్వంసమైంది. నేతివారిపల్లి, నగరిపాడు పరిధిలో 25 వేల అరటిచెట్లు నేలకూలాయి. గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యుత్, టెలికామ్ సేవలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరడంతో 12 గేట్లను ఎత్తి 10000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. గూడూరు, చవటిపాలెం, పురిటిపాలెం, విందురు, చిల్లకూర్లను వరద నీరు చుట్టుముట్టింది. నీళ్లు,ఆహారం కోసం గిరిజన గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read Also..
Read Also..