కమలాపూర్ టెన్త్ ఎగ్జామ్ సెంటర్ వద్ద పటిష్ఠ బందోబస్తు…
విద్యార్థులను తనిఖీ చేసాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతి
పరీక్ష కేంద్రం చుట్టుపక్కల పోలీసుల నిఘా
కిటికీలు మూసి పరీక్షల నిర్వహణ
గత ఏడాది హిందీ పేపర్ లీక్ వ్యవహారంతో పరీక్షా కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు
ఫ్లయింగ్, సిట్టింగ్స్ స్వాక్యాడ్ పర్యవేక్షణ
కమలాపూర్ మండలంలో టెన్త్ ఎగ్జామ్స్ పటిష్ట బందోబస్తు నడుమ కొనసాగుతున్నాయి. గత ఏడాది కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ పేపర్ లీక్ అవడంతో ఈసారి ఆఫీసర్లు, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా సెంటర్ చుట్టుపక్కల పోలీసుల ప్రహర ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానికి తోడు ఎగ్జామ్ జరిగే సెంటర్ ల వద్ద కిటికీలు మూసి పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఇక్కడ నెలకొంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కమలాపూర్ మండలంలోని నాలుగు సెంటర్లలో 614 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు. ఇన్విజిలేటర్లు స్టూడెంట్స్ ని పూర్తిగా తనిఖీ చేశాక పరీక్ష కేంద్రంలోకి అనుమతించగా పరీక్షా కేంద్రంలోకి వస్తున్న స్టూడెంట్స్ కి సీఐ హరికృష్ణ విషెస్ తెలిపి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు మంచిగా రాయాలని కోరారు. అలాగే హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం పై పోలీసులు విద్యాశాఖ ఆఫీసర్లు ఈసారి ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసుల బందోబస్తు కూడా పెంచారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి