పార్లమెంట్(Parliament) అభ్యర్థుల.. చంద్రబాబు(Chandrababu)..
పార్లమెంటు అభ్యర్థుల పట్ల పలు జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయా సీట్లకు తమ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు. ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థులను వెల్లడించింది. ఆ తర్వాత అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుని 13 లోక్ సభ సీట్లకు మూడో దఫాలో పేర్లను వెల్లడించారు. శ్రీకాకుళం లోక్ సభకు సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్(MP Kinjarapu Rammohan) నాయుడును ఎంపిక చేశారు. విశాఖపట్నం సీటుకు బాలకృష్ణ(Balakrishna) అల్లుడు మాత్కుమిల్లి భరత్ పేరు ప్రతిపాదించారు. అమలాపురం బరిలో గంటి హరీష్ మాధుర్(Harish Mathur) ను నిలుపనున్నారు. ఏలూరు లోక్ సభకు టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్(Putta Sudhakar Yadav) కుమారుడు పుట్టా మహేష్ యాదవ్(Mahesh Yadav) ను ఎంపిక చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విజయవాడ సీటుపై సస్పెన్స్ కు తెరదించారు. సిట్టింగ్ ఎంపీ, వైసీపీ అభ్యర్థి కేశినానికి పోటీగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ లేదా చిన్నిని దింపబోతున్నారు. ఇక గుంటూరుకు పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేటకు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన లావు శ్రీ కృష్ణ దేవరాయలును ఎంపిక చేశారు. బాపట్ల టికెట్ టి.కృష్ణ ప్రసాద్ కు ఇవ్వగా నెల్లూరు టికెట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. చిత్తూరు లోక్ సభ నుంచి దగ్గుమళ్ల ప్రసాద్ రావును బరిలో దింపబోతున్నారు. కర్నూలు టికెట్ బస్తిపాటి నాగరాజు, నంద్యాల టికెట్ బైరెడ్డి శబరిలను వరించింది. హిందూపురం నుంచి అక్కడి సీనియర్ నేత, మాజీ ఎంపీ బీకే. పార్థసారధికి కట్టబెట్టారు.
ఇది చదవండి: డ్రగ్స్ స్వాధీనం పై చంద్రబాబు విస్మయం వ్యక్తం..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి