కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay singh) ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన రాజ్‌గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను రాజ్‌గఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, దిగ్విజయ్ సింగ్ 33 ఏళ్ల తర్వాత రాజ్‌గఢ్ నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. సీనియర్ నేత మొదటి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరిస్తూనే వచ్చారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉందని, అందుకే ఈ లోక్‌సభలో పోటీ చేయనని గతంలో పేర్కొన్నారు. కానీ, తాజాగా జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీలోని దిగ్గజ నేతలను రంగంలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో రాజ్‌గఢ్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు రాజ్‌గఢ్ నియోజకవర్గం నుంచి దిగ్విజయ్ సింగ్ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు దాదాపు 33 ఏళ్ల తర్వాత తిరిగి రాజ్‌గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
ఇదిచదవండి: నీటి సమస్య తో అల్లాడి పోతున్న ప్రజలు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి