గుంజేడు ముసలమ్మ దేవాలయం..
దట్టమైన అడవి…చుట్టూ కొండలు…పక్కన సెలయేరు వేదికగా వెలసిన తోలెం వంశీయుల ఇలవేల్పు ఆదివాసీల దేవతగా వెలసి ప్రస్తుతం అందరి దైవంగా ముసలమ్మతల్లి విలసిల్లుతోంది. కొలిచిన వారి కోర్కెలు తీరుస్తూ.. కొంగుబంగారం చేస్తూ ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఉంది ముసలమ్మ జాతర. ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District)లోనే రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందింది. మహబూబాబాద్ జిల్లా(Mahbubabad District) కొత్తగూడ మండలంలోని గుంజేడులో ముసలమ్మ కొలువుదీరి ఉంది. రోజువారీగా ఈ జాతరకు భక్తులు వస్తునప్పటికీ ప్రతీ రెండేళ్లకొకసారి ఈ గుంజేడు ముసలమ్మ జాతరను మహాజాతరగా ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. జాతర నిర్వహిస్తున్న సమయంలో గుంజేడు ముసలమ్మ దేవత(Gunjedu Musalamma Goddess) ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుందని ఆదివాసీల నమ్మకం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్న భక్తులు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి