అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు(Brahmotsavams):
నెల్లూరు(Nellore) జిల్లాలో ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచి, పవిత్ర పెన్నా తీరాన వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి ఆలయ(Sri Ranganatha Swamy Temple) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గరుడవాహన సేవ అనంతరం స్వామి వారు అమ్మవార్లతో కలసి రథంపై విహరిస్తూ భక్తజనులకు దర్శనమిచ్చారు. జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరంగడి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీరంగ నామస్మరణల మధ్య నెల్లూరు రంగనాయకులపేట పురవీధుల్లో స్వామి వారు విహరించారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులతో స్వామి వారిని తిలకించి, తమ ఆకాంక్షలు నెరవేర్చాలని వేడుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ సారి రంగడి రథోత్సవ బాధ్యతలన్నీ ఆలయ కమిటి నిర్వాహకులే దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా, అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ నిర్వాహకులు పటిష్ట చర్యలు చేపట్టారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: మంత్రి ఉషశ్రీ అండతో రెచ్చిపోతున్న వైసిపి నాయకులు..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి