మేమంతా సిద్ధం డే3
తేది:29-03-2024
స్థలం: కర్నూల్ జిల్లా
3వరోజు మేమంతా సిద్ధం యాత్ర(Bus Yatra Day -3).. జగన్ కు నిరాజనం పలుకుతున్న జనం
మంచి చేసిన మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టండి: అక్కచెల్లమ్మలకు సీఎం జగన్(CM Jagan). సామాజిక న్యాయం చేసి వైయస్ఆర్సీపీ(YSRCP) ఒక సామాజిక ఇంధ్రధనుస్సుగా నిలిచింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు, మాట తప్పటమే తెలిసిన చంద్రబాబు కుటమి మధ్య జరుగుతున్న ఈ యుద్దానికి మీరు సిద్ధమేనా. పొత్తులను, జిత్తులను, మోసాలను, అబద్ధాలను, కుట్రలను ఎదుర్కునేందుకు, పేదల భవిష్యతుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర (BUS YATRA)3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ సభకు(SIDDHAM BUS YATRA DAY -3).. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్(CM Jagan) బస్సు యాత్ర కొనసాగింది. గూడూరు మండలం పెంచికలపాడు నుంచి కొత్తూరు, పాలకుర్తి మీదుగా కోడుమూరుకు.. కోడుమూరు నుంచి వర్కురు, వేముగొడు, పుట్టపాశం, హెచ్ కైరవాడి, గోనెగండ్ల, రాల్లదొడ్డి వరకు బస్సు యాత్ర సాగింది. రాల్లదొడ్డి శివారులో భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ఎర్రకోట మీదుగా ఎమ్మిగనూరుకు బస్సుయాత్ర చేరింది. ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ | CM Jagan Speech
ఎమ్మిగనూరులో ఈ సభ ఎప్పటికి సువర్ణ ఆక్షరాలతో నిలిచిపోతుంది. నా రాయలసీమ గడ్డ మీద మన కర్నూల్ జిల్లాలో వాన బిందువులు ఒక్కటైనట్టు, బిందువు బిందువు చేసి సింధువైనట్టు జన సముద్రం కనిపిస్తోంది. నా వాళ్లందరు జెండాలు జత కట్టిన వారిని పేదల వ్యతిరేకులను ఒడించి మీ వాడిని మీ బిడ్డను గెలిపించటం కోసం రావటం నా పూర్వ జన్మ సుక్రుతం.
మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగుబోతుంది. పేదలు ఒక వైపున పెత్తందారులు ఒక వైపున. పెత్తందారులను ఒడించేందుకు, పేదల పక్షాన నిలబడేందుకు నేను సిద్ధం, మీరంతా సిద్ధమేనా!
ఈ పొత్తులను, జిత్తులను, మోసాలను, అబద్ధాలను, కుట్రలను ఎదుర్కునేందుకు, పేదల భవిష్యతుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.
సిద్ధం, సిద్ధం అని చెబుతు లేచే చేయి, ప్రతి గుండె తమ ఇంట మంచి జరిగిందని, ఈ మంచి మేమంతా మద్ధతు పలుకుతామని ఇక్కడున్న ప్రతి చేయి చెబుతుంది.
రాష్ట్రంలో ఈ 58నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. నేను చెప్పే విషయాలు ప్రతి ఇంటికి వెళ్లి ఈ మార్పులు గురించి చెప్పాలని కోరుతున్న.
ఈరోజు 10, 16 ఏళ్ల తర్వాత పిల్లాడి చదువులు తర్వాత ఆనాడి ప్రపంచంలో ఎలా ఉండాలని ఆలోచించి, వారి భవిష్యత్తుకోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏ పేద కుటుంబమైనా మద్ధతు పలకకుండా ఎందుకు ఉంటుంది.
గ్రాడ్యుయేట్ చేసిన ఉద్యోగం రావటంలేదని బాధపడుతున్నావారి గురించి బాగా తెలుసు.. అందుకు నిలబెట్టే చదువులు, ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఈరోజు బడులకు పంపే తల్లులను ప్రోత్సాహించేందుకు అమ్మఒడిని తీసుకువచ్చాం, నాడు- నేడు, ఇంగ్లీష్ మీడియం, క్లాసు రూంలలో ఐబీ ప్యానల్, డిజిటల్ బోధనలు, ట్యాబులు, విద్యా కానుక కిట్లు, గోరు ముద్ద తీసుకురావటం కానీ మన ప్రభుత్వంలోనే జరిగింది. పిల్లల పై ఇంత ధ్యాస పెట్టడం గతంలో జరిగిందా ఆలోచన చేయండి. గతంలో ఏ పాలకులు పిల్లలు చదువులు గురించి ఆలోచించలేదు, కారణం ఒటు హక్కు లేకపోవటం.
అలాంటి పరిస్థితుల నుంచి క్వాలిటీ చదువు అందించాలని, పిల్లల భవిష్యత్తు మారాలని విద్యారంగంలో సంస్కరణలు తీసుకవచ్చిన ప్రభుత్వం భారతదేశంలో మరోకటి లేదని గర్వంగా చెబుతున్నా.. ఈలాంటి సంస్కరణలకు మద్ధతు పలుకుతారా? కనీసం పిల్లల గురించి ఆలోచన చేయని చంద్రబాబు కూటమికి మద్దతు పలుకుతారా, కాబట్టే చెబుతున్న ఈ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నుకునే ఒటు ఆ పిల్లల భవిష్యతు మారుతుంది, ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యతు మారుతుంది. మీ పిల్లల భవిష్యతు కోసం యుద్ధం చేయటానికి నేను సిద్ధం, మీరంతా సిద్ధమేనా!
గత ప్రభుత్వాలు నా అక్కచెల్లెల కోసం, చిట్టితల్లుల కోసం, అవ్వతాతలకోసం ఏమి చేసిందా అని అడిగితే చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేదు, గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ఆలోచన చేశాయంటే, 100కి 30 మంది కూడా పదవ తరగతి పూర్తి చేసినవారు లేరు, మన రాష్ట్రంలో బాల్యవివాహాలు ఉన్న ఆపే పరిస్థితి లేదు, తల్లికి ఎన్నో ఆశలు ఉన్న పిల్లల భవిష్యత్తు నిర్ణయించే ఆదాయం తల్లి దగ్గర లేదంటే… ఈటువంటి పరిస్థుతులు ఉన్న పట్టించుకోని పాలకులు ఉన్నా లేనట్టే
రైతులు, గింజలు పండించటంలో రైతు పాత్ర, కూలీ పాత్ర, నా అక్కచెల్లమ్మల పాత్ర నా కాళ్లతో నేను చూశా… ఈరోజు పనివాళ్లు రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటు ఎంత కష్టంగా వారి బతుకు బండిని నడిపిస్తున్నారో నా పాదయాత్రలో చూశా.. కాబట్టే వారి శ్రమకు ఎం చేయాలి అని చెప్పి 58 నెలల పాలనలో అదే ఆలోచన ముందుకు అడుగులు వేసి ప్రతి పథకం తీసుకువచ్చాం, ఈ ఆలోచనలో నుంచి పుట్టింది చేదోడు, విద్యాదీవెన, నేతన్న నేస్తం, మత్య్సకార భరోసా, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అన్నిటికి మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంటి ఇల్లాలి చేతులోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వమైన పెట్టగలిగితే ఆ కుటుంబాలు బాగుపడతాయననే ఆలోచించి అడుగులు వేశాం. ఐదేళ్లు అమలు చేస్తున్న పథకాలు చూసి అడుగుతున్న అక్కచెల్లమ్మలను మీరందరు మీ సహోదరుడికి రాఖి కట్టండి, మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టండి.
మహిళాసాధికారతనిస్తు, అక్కచెల్లమ్మలను నడిపిస్తా ఉన్న వారి భవిష్యత్తు కోసం రక్షాబంధన్ కట్టండి అని కోరుతున్న. ప్రతి అక్కచెల్లమ్మను కోరుతా ఉన్న, ఒక్కసారి మీ బ్యాంక్ దగ్గరకి వెళ్లి మీ ఆకౌంట్ 10ఏళ్ల స్టేట్మెంట్ అడగండి, చంద్రబాబు హయంలో ఒక్క రూపాయైనా వచ్చిందా గమినించండి అని కోరుతున్నా, మీ బిడ్డ హయంలో కేవలం 58 నెలల్లోనే రూ. 2.70లక్షల అందించాం, ప్రతి ఖాతాలో లక్షలు లక్షలు కనిపిస్తాయి.
ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నిక కాదు, రాష్ట్రంలో 2.5కోట్ల మంది అక్కచెల్లమ్మల భవిష్యతు, వారి పిల్లల భవిష్యతు నిర్ణయించే ఎన్నికులు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని గట్టిన మనకు, రైత వ్యతిరేక కూటమికి జరగుతున్న సంగ్రమం ఇది. రైతు భరోసాగా ఈ 58నెలలో ప్రతి రైతన్న చేతిలో రూ.13000 ఇస్తు ఏకంగా రూ. 67500 ప్రతి రైతన్న చేతిలో పెట్టం, అదే చంద్రబాబు హయంలో రూ. 87వేల కోట్ల రుణమాఫీ పేరిట మోసం చేసిన ఆయన మనస్తత్వం ఎలా ఉంది, ప్రతి రైతన్న చేతిలో రూ. 67500 పెట్టిన మీ బిడ్డ ప్రభుత్వం ఎలా ఉంది ఆలోచన చేయండి.
రైతన్నను రాజుగానే చుశాం, రైతన్నను గుండెల్లో పెట్టుకుని పరిపాలన చేసిన రైతు పక్షపాత ప్రభుత్వం మనది, ప్రతి రైతు భుజం తట్టి మీ వెంట తోడుగా మేమున్నామని ప్రభుత్వానికి చెప్పాలని కోరుతున్నా.
రైతులను మోసం చేయటమే పనిగా పెట్టుకున్న పార్టీలకు, వ్యవసాయం దంగా అన్నపార్టీలకు మద్దుతు ఇస్తారా, రైతన్న ముఖంలో చిరునవ్వులు చూడాలని, వ్యవసాయం పండుగుగా మార్చాలని, మీ రైతు బిడ్డ మీ భూమిపుత్రుడికి మద్దతు పలుకుతారా.
సామాజిక న్యాయం చేస్తు, ఆణగారిన వర్గాలకు నేను ఉన్న భరోసా ఇచ్చిన ప్రభుత్వం, నా అక్కచెల్లమ్మల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు అందించాం. ఇందులో 75శాతం నా ఎస్సీ, నాఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే అందించాం, వైయస్ఆర్సీపీ ఒక సామాజిక ఇంధ్రధనుస్సు.
గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని అడుకున్న వారికి బుద్ధి చెప్పండి, పేదలకు ఇళ్లు ఇస్తుంటే కులాల సమతుల్యతకి అడ్డంకి పడుతుందని ఏకంగా కోర్టుల్లో కేసులు వేసిన పార్టీలకు సమాధులు కట్టండి, ఎస్సీల్లో ఎవరైన పుట్టాలనుకుంటరా అన్న వాళ్లకి రాజకీయ భవిష్యత్తు లేకుండా తీర్పును ఇవ్వండి, బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబు తోకను, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి, మైనార్టీల రిజర్వేషన్ను పణంగా పెట్టండమే కాకుండా, మైనార్టీల మనోభవాలతో గత 30 ఏళ్ల చలగాటం ఆడుతున్న బాబును ఏ మైనార్టీ వ్యక్తి అయినా సమర్థించవచ్చా అని అడుగుతున్న.
ఈ నాలుగు వర్గాలు నేను నా.. నా.. నా అని పిలుచుకునే వర్గాలు…
చంద్రబాబుకు నా అని పిలుచుకునే వర్గాలు మన రాష్ట్రంలో అయితే లేవు, హైదరాబాదు హైటెక్ సీటీ వద్ద పచ్చమీడియా, దత్తపుత్రుడు.. వీళ్లేవరు మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు నాయుడుకు నా.. నా.. నా.. అని పిలిచుకునేవాళ్లు మన రాష్ట్రంలో ఎవరు లేరు.. ఇవన్ని ఆలోచనచేయమని కోరుతున్న.
ఈ చంద్రబాబు అనే వ్యక్తికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు… ఆయన పేరు చెబితే గుర్తుకువచ్చేది మాత్రం వెన్నుపోట్లు,మోసాలు.
చంద్రబాబు పేరు చెబితే 2014లో పంపించిన ముఖ్యమైన హామీల్లో ఒకటి రైతుల రుణమాఫీ పై సంతకం చేస్తా అన్నాడు, చేశాడా? రెండవది పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పాడు, చేశాడా? ఆడుబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25వేల బ్యాంకులో డిపాజిట్ చేస్తాని అన్నాడు, చేశాడా? నిరుద్యోగ భృత్తి ఇస్తానని అన్నాడు.. చేశాడా? సింగపూర్ కి మించి చేస్తా అన్నాడు.. చేశాడా?
ప్రతి జిల్లాలో హైటెక్ సీటీ కడతానని హామీ ఇచ్చాడు, మీ జిల్లాలో ఎదైన నగరం ఉందా? వీరందరు కలిసి ఇచ్చిన హామిల్లో ఒక్కటైనా చేశాడా? కనీసం ప్రత్యేక హోదా ఇచ్చాడా? ఇవేమి చేయకపోగ మళ్లి ఎన్నికలు వచ్చేసరికి ఇదే కూటమి, ఇదే ముగ్గురితో కలిసి సూపర్ సీక్స్, సూపర్ సెవన్ అంట, ప్రతి ఇంటి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజీ కారు అంట.
ఇలాంటి మోసాలనుంచి మన రాష్ట్ర ప్రజల భవిష్యతును కాపాడుకోవాలి.. ఈ యుద్దంలో నేను సిద్ధం.. మీరంతా సిద్ధమేనా! ఇచ్చన మాట నిలబెట్టుకున్న మనకు, మాట తప్పటమే చంద్రబాబు కుటమి మధ్య జరుగుతున్న ఈ యుద్దంలో విలువలకు, విశ్వసనీయతకు మద్దతు పలకటానికి మీరంతా సిద్ధమేనా!
జరగబోయే ఈ ఎన్నికల కురక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరు స్టార్ క్యాంపెయినర్లుగా బయటకి రావాలి, ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి, పేదవాడికి రక్ష జగనన్నే అని, చంద్రబాబు మోసాలను నమ్మోవద్దని, ఆ ఇంట్లోని ప్రతి అక్కను, అవ్వను స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి తీసుకురావాలి.
మంచి చేశాం.. మంచి చూపించి ప్రజల వద్దకు వెళ్తున్నాం, మంచి జరిగిన ప్రతి ఇంట్లో నుంచి మీకు ఒకవేళ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకోసం స్టార్ క్యాంపెయినర్లగా బయటికి రండి. మంచి చేశాం కాబట్టే మన టార్గెట్ 175/75ఎమ్మెల్యే, 25/25ఎంపీ స్థానాలు తగ్గకుండా రావాలి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి