అతనో ఎంబిబిఎస్ చదివిన డాక్టర్. జల్సాలకు, బెట్టింగులకు అలవాటు పడి దొరికిన చోట అప్పు చేస్తాడు. తీరా అప్పు తీర్చాల్సి వస్తే అప్పిచ్చిన వ్యక్తికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి కడ తేరుస్తాడు. ఏలూరు వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు చైత్ర ఆసుపత్రిలో పనిచేస్తున్న భాను సుందరం (Dr. Bhanu sundaram) Marphinఅనే డాక్టర్ తెలిసిన వారి వద్ద అప్పు చేస్తాడని, తీరా అప్పు తిరిగి చెల్లించాల్సి వస్తే డబ్బులు అప్పు ఇచ్చిన వారికి మార్ఫిన్ ఇంజక్షన్ ఇచ్చి వారు స్పృహ కోల్పోయేలచేసి తర్వాత వారిని తానే హాస్పిటల్ లో జాయిన్ చేసి, హాస్పిటల్ ఖర్చులకు అని చెప్పి డబ్బులు తీసుకుని వారిని మంచానికి పరిమితం చేస్తాడని తెలిపారు. ఏలూరికి చెందిన వాచర్ల హాహితేజ వద్ద తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడానికి అనారోగ్యకరమైన మత్తుపదార్థాలు ఇంజక్షన్ చేసిన ఘటన నేపధ్యంలో నిందితుడు భాను సుందర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇది చదవండి: వాలంటీర్ వ్యవస్థ పై కక్ష తగదు..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి