కాంగ్రెస్(Congress) 100 రోజుల పాలనలో 200 మంది రైతులు(Farmers) ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేసీఆర్(KCR) ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మండిపడ్డారు. దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను 48 గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను సిఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..
బీఆర్ఎస్(BRS) హయాంలో జరిగిన అవినీతి, ఎంపీలు పార్టీని వీడటం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పర్యటన చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్.. రద్దైపోయిన 1000 నోటు లాంటి వారని, ఆయన ఎవరితో ఉంటే వారు అరెస్టవుతారన్నారు. బీఆర్‌ఎస్‌కు అందిన 1500 కోట్ల ఎన్నికల బాండ్ల నిధుల నుంచి రైతులకు 100 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్‌ను రేవంత్ డిమాండ్ చేశారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి