శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 6 నుండి 10 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈనేపథ్యంలో దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది తరలివస్తున్నారు. నల్లమల అంత ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది ఉగాది పర్వదినం సమీపిస్తుండటంతో శ్రీగిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని అయితే అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులంటున్నారు.
నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మార్మోగుతున్న శ్రీశైలం మరోపక్క వైద్య సదుపాయాలు బాగున్నాయని అడవి మార్గంలో బీమకొలను మీదుగా కొండెక్కి కన్నడిగులు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న నేపద్యంలో దేవస్థానం అధికారులు లక్షలు ఖర్చుపెట్టి కాలినడకన నల్లమల నుండి వచ్చే కన్నడ భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారని పాదయాత్ర భక్తుల కోసం అడవిమార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లడం వచ్చే భక్తులకు మార్గమధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్చంద సేవకర్తలతో అన్నదాన ఏర్పాటు చేశారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివితీరా చూసేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుండి దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటున్న వస్తున్న పాదయాత్ర కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు కన్నడ భక్తులు తెలిపారు.