అమెరికా(America)లోని ఒహాయోలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. క్లీవ్‌ల్యాండ్(Cleveland)లోని ఒహాయోలో భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణం చాలా బాధాకరమని, ఈ కేసును పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారని, ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
ఇది చదవండి: జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం..!
ఉమా మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు పంపించడంతో పాటు అవసరమైన ఇతర సహాయాన్ని అందిస్తామని కూడా ఆ ట్వీట్‌లో ఇండియన్ ఎంబసీ పేర్కొంది. అమెరికాలో నివసిస్తోన్న భారతీయులు, భారత మూలాలున్న విద్యార్థుల మరణాలు ఇటీవల పెరిగాయి. తాజాగా ఉమా సత్యసాయి మరణంతో అమెరికాలో ఉన్న భారతీయ సమాజం షాక్‌కు గురైంది. తాజా ఘటనతో కలిపి ఈయేడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు అమెరికాలో 10 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి