టీచర్ల ప్రమోషన్ల(Teachers Promotions)కు కచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై ఇంకా అయోమయం నెలకొంది. ప్రధానంగా హెడ్మాస్టర్ పోస్టులతో పాటు లాంగ్వేజ్ పండిట్లకు చెందిన ప్రమోషన్ అంశంపై కూడా క్లారిటీ రావడం లేదు. అయితే ఒకే స్కూల్ లెవెల్ ప్రమోషన్ పోస్టులకు టెట్ అవసరం లేదని టీచర్ల సంఘాలు చెప్తుండగా ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ క్వాలిఫై తప్పనిసరని విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో మరింత స్పష్టత కోసం అధికారులు NCTకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా 2010లో టెట్ అంశం తెరమీదికి వచ్చింది.
ఇది చదవండి: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెన్నై కస్టమ్స్ శాఖ సమన్లు…!
ఇందులో భాగంగా కొత్త రూల్స్ తో పాటు ప్రమోషన్లకు టెట్ అమలు చేయాలని NCT పేర్కొంది. అయితే టీచర్ల ప్రమోషన్లకు మాత్రం ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు తీసుకుంటూ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తూ వచ్చారు. ప్రమోషన్లలోనూ టెట్ ను అమలు చేయాలని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల టెట్ నోటిఫికేషన్ రావడంతో టీచర్లు కూడా టెట్ రాయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే దీంట్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని టీచర్ల సంఘాల నేతలు చెప్తున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి