హరహర మహాదేవ శంభోశంకర…| Srisailam Mallanna
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు (Srisailam-Ugadi)మూడోవరోజు సంబరాలు అంభరాన్నంటాయి అశేష జనవాహిని మద్య శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ప్రభోత్సవం కన్నుల పండుగగా సాగింది వేలాదిమంది కన్నడ భక్తజనంతో శ్రీశైలం ప్రదాన రహదారులు కిటకిటలాడాయి భ్రమరాంబాదేవి తమ ఆడపడుచుగా మల్లికార్జునస్వామి తమ అల్లుడిగా కొలిచె కన్నడిగులు ప్రభోత్సవంలో పాల్గోని శ్రీస్వామి అమ్మవార్లను దర్శించి తరించారు ప్రభోత్సవాన్ని కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ శ్రీశైలం పురవీధులు మారుమ్రోగాయి.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముందుగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు అనంతరం పల్లికిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రధాశాల వద్దకు తరలిరాగా ఉత్సవమూర్తులకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక హారతులిచ్చారు అశేష జనవాహిని మద్య ప్రభోత్సవం కధలగానే వేలాదిమంది భక్తులు ఓం నమః శివాయ శ్రీశైల మలన్న మమధుకోవయ్య అంటూ నినాదించటంతో శ్రీశైల క్షేత్రం పులకించి పోయింది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం అరటిపండ్లను ప్రభోత్సవంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వనులతో సంబరాలు చేశారు ఈ ప్రభోత్సవంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు,పెద్దఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి