ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) :
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేర్కొన్నారు. నేను బాధితురాలిని.. నా అరెస్టు అక్రమం.. నాకు న్యాయం కావాలి అంటూ తీహార్ జైలు నుంచి ఆమె రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి నాలుగు పేజీల లేఖ రాశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆరోపిస్తున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక లబ్ది చేకూరలేదని కవిత స్పష్టం చేశారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి, తన రాజకీయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్రలో భాగంగా పెట్టిన కేసు అని లేఖలో పేర్కొన్నారు.
ఇది చదవండి : కొండ సమక్షంలో బీజేపీలోకి భారీగా చేరిన చేవెళ్ల యువకులు..
తప్పుడు కేసు పెట్టి తనను అరెస్టు చేశారని ఆరోపించిన కవిత.. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసులో ఈడీ, సీబీఐ దర్యాఫ్తు చేస్తున్నాయని చెప్పారు. దర్యాఫ్తు సంస్థలకు తాను పూర్తిగా సహకరించానని వివరించారు. పిలిచినప్పుడు వెళ్లి అధికారుల ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చినట్లు కవిత (MLC Kavitha) తెలిపారు. అధికారులు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదని, ఈ కేసులో తానే బాధితురాలినని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాఫ్తు మొత్తం మీడియా ట్రయల్స్ గా మారాయని, మీడియాలో సోషల్ మీడియాలో తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.