లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ ఆమ్ఆద్మీ(Aam Aadmi)పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం కేబినెట్ లో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. ఆప్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అవినీతిపై పోరాడేందుకు ఆప్ పుట్టింది కానీ ఇప్పుడు అదే పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అవినీతి పరులతో తాను ఉండలేనన్నారు.
ఇది చదవండి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో చేపట్టిన చంద్రయాన్ – 4 మిషన్…
ఈ క్రమంలో ప్రభుత్వానికి ,పార్టీకి తాను దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాజ్ కుమార్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. ఇదే కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి