లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఇన్ కం ట్యాక్స్ కు సంబంధించి నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ.. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. తర్వాత రిలీజ్ చేసినప్పటికీ వంద కోట్లకు పైగా నిధులను బ్లాక్ చేసింది. దీంతో పార్టీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఖర్గే, రాహుల్ సహా పలు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఇది చదవండి: ఛత్తీస్ ఘడ్ లో రోడ్డు ప్రమాదం…
మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ఈడీ.. నేషనల్ హెరాల్డ్(National Herald) పేపర్ సహా పలు సంస్థలకు చెందిన రూ.752 కోట్ల ఆస్తులను గతేడాది సీజ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తోంది. పీఎంఎల్ఏ అథారిటీని ఆశ్రయించింది. తాజాగా, ఈ విషయంపై తీర్పు చెబుతూ ఆస్తుల అటాచ్ సబబేనని పీఎంఎల్ఏ అథారిటీ తేల్చిచెప్పింది. ఈడీ ఎటాచ్ చేసిన చరాస్తులు, ఈక్విటీ వాటాలు మనీలాండరింగ్ నేరానికి సంబంధించినవిగా భావిస్తున్నట్లు పేర్కొంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.