పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఎన్నికల(Central Elections) సంఘానికి టీడీపీ(TDP) లేఖ రాసింది. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర(Kanakamedala Ravindra) ఈసిఐ(ECI)కి లేఖ రాశారు. సీఎం జగన్(CM Jagan) పై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు తగు చర్యలు చర్యలు తీసుకోవాలని గతంలో ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారని గుర్తు చేశారు.
ఇది చదవండి: రంజాన్ పండగ పూట వివాహిత బలవన్మరణం
అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించిన కె. అశోక్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని కోరారు. బీటెక్ రవికి ఎటువంటి ప్రాణహాని లేదని స్థానిక ఎస్పీ చెప్పడం వాస్తవ విరుద్ధమన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఎంపికలో ఎన్నికల అధికారులు, పోలీసులు … పోటీ చేస్తున్న అభ్యర్థులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఈసి చెప్పినప్పటికీ పులివెందులలోని మొత్తం 68 కేంద్రాలలో కేవలం 32 మాత్రమే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని స్థానిక ఎస్పీ తెలపడం అవాస్తవమని కనకమేడలో లేఖలో తెలిపారు. ఈసీఐ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కనకమేడల రవీంద్ర లేఖలో కోరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.